Current Date: 07 Oct, 2024

ధోనీ వార్నింగ్‌తో భయపడిపోయిన ఫాస్ట్ బౌలర్

భారత జట్టు సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్‌ అశ్విన్‌ తన ఆత్మకథలో మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ గురించి ఆసక్తికర విషయాల్ని వెల్లడించాడు. 2010లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్‌పై ధోనీ కోప్పడుతూ వెంటనే ఇండియాకి వెళ్లిపోయేలా ఆదేశాలు ఇచ్చాడని అశ్విన్ రాసుకొచ్చాడు.‘ఐ హ్యావ్‌ ద స్ట్రీట్స్‌ - ఎ కుట్టి క్రికెట్‌ స్టోరీ’ పేరుతో 184 పేజీల పుస్తకాన్ని అశ్విన్‌ తీసుకొచ్చాడు. ఇందులో ధోనీ గురించి రాసుకొస్తూ.. 2010లో పోర్ట్‌ ఎలిజబెత్‌లో దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌ ఆడుతున్నాం. కానీ.. ఆ మ్యాచ్‌లో నేను, శ్రీశాంత్‌ తుది జట్టులో చోటు సంపాదించుకోలేపోయాం. దాంతో రిజర్వ్‌ ఆటగాళ్లుగా ఉన్నాం. మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తున్న ధోనీ కోసం మైదానంలోకి తరచూ నీళ్లు తీసుకెళ్లి నేనే ఇస్తున్నా. దాంతో శ్రీశాంత్‌ ఏం చేస్తున్నాడని ధోని అడిగాడు. అతను డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఉన్నాడని చెప్పా. దాంతో ధోనీ కోపంగా శ్రీశాంత్‌ను కిందకొచ్చి మిగతా రిజర్వ్‌ ఆటగాళ్లతో కలిసి కూర్చోమని చెప్పమన్నాడు.ధోని చెప్పిన విషయాన్ని శ్రీశాంత్‌కు తెలియజేసినా అతను పట్టించుకోలేదు. 

Share