ఎయిరిండియా విమానంలో ప్రయాణికులకు సరఫరా చేసిన ఆహారంలో బొద్దింక కనిపించిందని ఓ ప్రయాణికురాలు ఆందోళన వ్యక్తం చేస్తూ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ‘సెప్టెంబరు 17న ఢిల్లీ నుంచి న్యూయార్క్ వెళ్తున్న విమానం ఆన్‌బోర్డ్ భోజనంలో మేము బొద్దింకను కనుగొనే సమయానికి నాతోపాటు నా రెండేళ్ల బిడ్డ సగానికిపైగా ఆమ్లెట్ తిన్నాం. ఫుడ్ పాయిజన్‌తో ఇబ్బంది పడ్డాం’ అని ఆమె తెలిపారు. విమానంలో అందించిన ఆహార పదార్థాల వీడియో, చిత్రాలను జత చేసి ఎయిరిండియా, ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ, విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్‌నాయుడులకు తన ఫిర్యాదును ట్యాగ్ చేశారు. దీనిపై ఎయిరిండియా స్పందించింది. ‘మీరు పడ్డ ఇబ్బంది గురించి ఆందోళన చెందుతున్నాం. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటాం’ అని తెలిపింది.
Share