Current Date: 29 Sep, 2024

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను భేషరతుగా విరమించాలి. ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ కన్వీనర్ వీవీ రమణమూర్తి ...

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను భేషరతుగా విరమించి, ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ కన్వీనర్  వీవీ రమణమూర్తి డిమాండ్ చేశారు. జీవీఎంసీ గాంధీ విగ్రహ వద్ద నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు ఆదివారానికి 1281వ రోజుకు చేరుకున్నాయి. దీక్షలో పాల్గొన్న రమణమూర్తి మీడియాతో మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు కేటాయించి, రూ.10000 కోట్ల  నిధులు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అప్పుడు స్టీల్ ప్లాంట్ లాభాల బాటల్లో నడుస్తుందని తెలిపారు.  స్టీల్ ప్లాంట్ కు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని విరమించాలని, స్టీల్ ప్లాంట్ కార్మికులను, ఉద్యోగులను ఇతర ప్లాంట్లకు బదిలీ చేయడాన్ని ఆపివేయాలని విజ్ఞప్తి చేశారు. స్టీల్ ప్లాంట్ నిర్వాసితులందరికీ  శాశ్వత ఉద్యోగాలు కల్పించాలని కోరారు. పి ఓ డబ్ల్యు జిల్లా అధ్యక్షులు యస్ వెంకటలక్ష్మి మాట్లాడుతూ  సామాజిక న్యాయాన్ని రిజర్వేషన్లను దెబ్బతీసే ప్రైవేటీకరణను వ్యతిరేకిద్దామని కోరారు. 

Share