Current Date: 28 Nov, 2024

భారీ వర్షాలు స్కూళ్లకు సెలవు

 రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖ జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్పొరేట్‌ పాఠశాలలకు శనివారం సెలవు ప్రకటించారు. కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ ఆదేశాల మేరకు విద్యాశాఖ అధికారి చంద్రకళ ప్రకటన విడుదల జారీ చేశారు. స్కూళ్ల నిర్వాహకులు సెలవు ప్రకటిస్తూ తల్లిదండ్రుల మొబైల్స్‌కు మెసేజ్‌లు పంపారు. మరి కొన్ని స్కూళ్లు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నామని తెలియజేశారు.

Share