Current Date: 25 Nov, 2024

భయంకరంగా సుడులు తిరుగుతున్న తుపాను...

అమెరికాను వణికిస్తున్న ‘బాంబ్ సైక్లోన్’ ఉపగ్రహం కంటికి చిక్కింది. తుపాను తీవ్ర రూపం దాల్చుతూ పసిఫిక్ మహాసముద్రం వాయవ్య ప్రాంతానికి సమీపిస్తున్న అద్భుతమైన దృశ్యాన్ని ఉపగ్రహం చిత్రీకరించింది. తుపాను కారణంగా వాషింగ్టన్‌లోని లిన్‌వుడ్‌లో చెట్లు విరిగిపడడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. భారీ వర్షాలు భయపెడుతుండగా, విపరీతంగా కురుస్తున్న మంచు కారణంగా విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ ప్రభావం ఆరు లక్షల ఇళ్లపై పడింది. వాషింగ్టన్, ఓరెగావ్, కాలిఫోర్నియాలో వ్యాపారాలు దెబ్బతిన్నాయి. బాంబ్ సైక్లోన్ ప్రభావం కెనడా, బ్రిటిష్ కొలంబియాపైనా పడింది. కెనడాలోని పసిఫిక్ తీర ప్రాంతంలో 2.25 లక్షల ఇళ్లకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. 

Share