Current Date: 25 Nov, 2024

వామ్మో...ఏంటయ్యా ఇదీ... ఈ వ్యక్తి రాగానే చుట్టూ చేరిన చేపలు....

కొందరు ఎలాంటి వివిధ రకాల జంతువులను మచ్చిక చేసుకుని వాటితో స్నేహం చేయడం చూస్తుంటాం. మరికొందరు క్రూర జంతువులతోనూ చిన్న పిల్లల్లా ఆటలు ఆడుకుంటుంటారు. ఇంకొందరు అనేక జంతువులకు ఆహారం పంచిపెడుతూ వాటిని ప్రేమగా చూసుకుంటుంటారు. అయితే తాజాగా, ఓ వ్యక్తి చేసిన పని చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఆ వ్యక్తి నీటిలోకి దిగగానే పెద్ద పెద్ద చేపలన్నీ చుట్టూ చేరాయి. ఆ వ్యక్తి చేపలకు సంబంధించిన ఆహారాన్ని ఓ సంచిలో వేసుకుని చెరువులోకి వెళ్తాడు. అతడు అలా వెళ్లగానే పెద్ద పెద్ద చేపలన్నీ వచ్చి అతడి చుట్టూ చేరతాయి. తర్వాత అతను సంచిలోని ఆహారంలో కొద్ది కొద్దిగా తీసుకుని చేప నోట్లో వేస్తుంటాడు. ఇలా ఒక్కొక్క చేప అతడు పంచిన ప్రసాదాన్ని తీసుకుని బుద్ధిగా అక్కడి నుంచి వెళ్లిపోతుంటాయి. ఇలా చేపలు అతడి వద్ద ఎంతో వినయంగా ప్రవర్తిస్తూ ఆహారం తీసుకోవడం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అతను కూడా ఎంతో ఓపిగ్గా ఒక్కో చేపకు ఆహారం అందించి, వాటి తలపై చేత్తో ప్రేమగా నిమురుతుంటాడు. ఇలా అతడి వద్దకు వచ్చిన చేపలన్నింటికీ ఆహారం పంచిపెడుతూ వాటికి స్నేహితుడిలా మారిపోయాడు.