Current Date: 07 Oct, 2024

తిరుమలలో కొత్త తరహా మోసం.. పట్టుకున్న పోలీసులు

తిరుమలలో మరో కొత్త మోసం వెలుగు చూసింది. భక్తుల ఆధార్ కార్డులతో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డును మోసం చేస్తున్న ఇద్దరు దళారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భక్తుల ఆధార్ కార్డుల సాయంతో గదులు తీసుకుంటూ టీటీడీని మోసం చేస్తున్నట్లు గుర్తించారు.ఇద్దరు దళారులు గత రెండు నెలల్లో 45 గదులు తీసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా తరుచుగా గదులు తీసుకుంటున్న వైనాన్ని గుర్తించిన టీటీడీ సిబ్బంది.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఇద్దరు దళారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను కృష్ణా జిల్లాకు చెందిన నాగ బ్రహ్మచారి, వరంగల్‌కు చెందిన వెంకటేశ్వరరావుగా గుర్తించారు.విలాసాలకు అలవాటు పడిన దళారులు..  తిరుమలకు వచ్చే భక్తులను మోసం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆధార్ కార్డుల సాయంతో తిరుమలలో రూ50, రూ.100ల గదులు అద్దెకు తీసుకుని.. ఆ గదులను రూ.1000ల అద్దెకు ఇస్తున్నట్లు దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. టీటీడీ నూతన ఈవోగా జె. శ్యామలరావు బాధ్యతలు స్వీకరించిన తర్వాత తిరుమలలో ప్రక్షాళన ప్రారంభమైంది.

Share