సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం సర్వీసులోకి తీసుకొంది. ఆయనకు శుక్రవారం ప్రింటింగ్, స్టేషనరీ, స్టోర్స్ కమిషనర్‌గా నియమించారు. ఏబీవీపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన సస్పెన్షన్‌ను ఇటీవల కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) ఎత్తివేసింది. శుక్రవారమే ఏబీ వెంకటేశ్వరరావు ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను సర్వీసులోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయనకు పోస్టింగ్ ఇస్తూ ఆదేశాలు ఇచ్చారు.