Current Date: 28 Nov, 2024

మీడియాపై నటి హేమ ఫైర్.. డ్రగ్స్ టెస్టుపై ఓపెన్ ఛాలెంజ్

టాలీవుడ్ సీనియర్ నటి హేమ మీడియాపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. రేవ్ పార్టీ కేసు ఆమెని వెంటాడుతండటంతో.. సహనం కోల్పోయి మీడియాకి ఓ ఛాలెంజ్ విసిరారు. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని, మీడియానే తనకు టెస్టులు చేయించాలని డిమాండ్ చేశారు.మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. నాకు టెస్టులు చేయించండి. మీకు అన్ని శాంపిల్స్ ఇస్తాను. పాజిటివ్ వస్తే మీరు ఏ శిక్ష వేసినా నేను అనుభవిస్తా. నాకు నెగెటివ్ వచ్చిందని చెబుతుంటే మీరు నమ్మడం లేదు. నేను చేయించుకున్న టెస్టులు మీరు నమ్మకపోతే, నేనే వస్తాను, మీరే నాకు టెస్టులు చేయించండి. మీడియా సంస్థల యజమానులంతా కలిసి ఓ నిర్ణయం తీసుకొని 2-3 రోజుల్లో నన్ను మీ దగ్గరకు పిలవండి.”తన లాయర్ ఫోన్ చేశాడని, తనకు నెగెటివ్ వచ్చినట్టు ఛార్జ్ షీట్ లో ఉందని లాయర్ చెప్పాడని హేమ అంటున్నారు. తన కుటుంబం తలదించుకునే పని ఎప్పుడూ చేయలేదని పరువు కోసం చచ్చిపోతానని హేమ భావోద్వేగంగా చెప్పుకొచ్చారు.

Share