హనీట్రాప్ కేసు విశాఖను కుదిపేస్తుంది. సైబర్ నేరగాళ్లకు విశాఖ ఒక ప్రయోగశాలగా మారింది. వారు చేసే అన్నిరకాల మోసాలను వైజాగ్ వాసులపైనే ప్రయోగిస్తున్నారు. తెలిసీతెలియక చాలామంది సైబర్ నేరగాళ్ల వలలో పడి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. జమీనాను అడ్డుపెట్టుకుని పెద్దగ్యాంగ్ బాధితులను బెదిరించి డబ్బు వసూలు చేసినట్టు గుర్తించారు పోలీసులు. ప్రీప్లాన్డ్‌గా ట్రాప్ చేసి డబ్బు దోచేశారన్నారు. విశాఖ కేంద్రంగా స్టాక్ మార్కెటింగ్, ఫెడెక్స్, ఆన్లైన్ మోసాలకు పాల్పడింది. సీ స్మైల్ అపార్ట్మెంట్లో దాడులు చేసి ఫెడెక్స్ స్కామ్, ఆన్లైన్ మెసాలకు పాల్పడుతున్న మొత్తం ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా కాయ్ రాజా కాయ్ అంటూ ఆన్లైన్ బెట్టింగులకు పాల్పడి డబ్బును చైనా, తైవాన్‌కు చేరవేసినట్టు పోలీసులు గుర్తించారు.