తిరుమలలో ప్రమాణం పేరుతో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన హైడ్రామాపై పవన్ కల్యాణ్ స్పందించారు. విజయవాడ ఇంద్రకీలాద్రి వద్ద ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. లడ్డూ పవిత్రతపై వ్యంగ్యంగా మాట్లాడారని, భూమన నాశనం మొదలైందని వ్యాఖ్యానించారు. మరో మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కచ్చితంగా విచారణకు రావాల్సిందేనని హెచ్చరించారు. జగన్ హయాంలో తిరుమలను ఇష్ట్యారాజ్యంగా చేశారని టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిపై మండిపడ్డారు. తాను శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు ధర్మారెడ్డి వ్యహరించిన తీరును పరిశీలించానని చెప్పారు. లడ్డూపై ఇంత వివాదం జరుగుతుంటే ధర్మారెడ్డి ఏమయ్యారని ప్రశ్నించారు. తిరుమలను వ్యాపార కేంద్రంగా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధ్యాత్మిక కేంద్రాన్ని పర్యటక కేంద్రంగా చేశారని పవన్ ధ్వజమెత్తారు. ధర్మారెడ్డి కుమారుడు చనిపోతే 11 రోజులు గడవకముందే తిరుమల ఆలయంలోకి వచ్చి ఆపచారం చేశారని గుర్తు చేశారు. సనాతన ధర్మంపై పోరాటం చేస్తే తమను ఎవరూ ఆపలేరని పవన్ హెచ్చరించారు.
Share