యంగ్ హీరో రాజ్ తరుణ్ తెరవెనక కూడా పెద్ద లవర్ బాయ్ అంటోంది అతని ప్రియురాలు లావణ్య. కేవలం లవర్ మాత్రమే కాదు, రాజ్ తరుణ్ ను స్త్రీలోలుడుగా చెప్పుకొస్తోంది. అతడి ఎఫైర్లను బయటపెడుతూ పెద్ద ప్రెస్ మీట్ పెట్టింది."నాకు తెలిసి, నాకు కన్ఫర్మేషన్ ఉన్న ఎఫైర్లు కొన్ని ఉన్నాయి. రాజ్ తరణ్ ఎఫైర్లు లవర్ సినిమా నుంచి మొదలయ్యాయి. రిద్దితో రాజ్ ఎఫైర్ సాగించాడు. నేను ఆ అమ్మాయికి కాల్ చేసి చెప్పాను, 6 నెలల డేటింగ్ తర్వాత రిద్ది, ఆ ఎపైర్ ఆపేసింది. ఇద్దరిలోకం ఒకటే అనే సినిమాలో హీరోయిన్ గా నటించిన షాలినీతో కూడా రాజ్ తరుణ్ ఉన్నాడు. బిగ్ బాస్ అరియానా గ్లోరీతో కేవలం ఒక రోజు మాత్రమే షూట్ చేశాడు. ఆ ఒక్క రోజులోనే కలిసిపోయారు. నాకు అప్పుడు డీజేయింగ్ అంటే ఇష్టం ఉండేది. ఆ కోర్సు చేసేందుకు చెన్నై వెళ్లాను. నేను వెళ్లిన నెల రోజులకే హైదరాబాద్ లో అరియానాతో రాజ్ స్టార్ట్ చేశాడు. రాజా రవీంద్ర ఫోన్ చేసి రాజ్ తరుణ్ చేయిదాటిపోతున్నాడని చెప్పిన వెంటనే హైదరాబాద్ వచ్చేశాను" అని చెప్పుకొచ్చిందిరాజ్ తరుణ్ కు ఎన్ని ఎఫైర్లున్నప్పటికీ, వాటిని తను ప్రాబ్లమ్ గా ఫీల్ అవ్వలేదంటోంది లావణ్య. అతడు తనతో ఉన్నాడనే నమ్మకంతో ఉన్నానని, మాల్వీ మల్హోత్రా సీన్ లోకి వచ్చిన తర్వాత తనకు ఆ నమ్మకం పోయిందని,