Current Date: 26 Nov, 2024

ఇవాళ్టి నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10గంటలకు శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. దాదాపు రూ. 2.90 లక్షల కోట్లతో 2024 – 25 వార్షిక బడ్జెట్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఎన్నికల హామీల్లో భాగమైన సూపర్ -6 పథకాల అమలుకు వార్షిక బడ్జెట్ లో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అభివృద్ధి – సంక్షేమం సమతూకంగా బడ్జెట్ రూపకల్పన చేయనున్నారు. అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టనున్నారు. అదేవిధంగా శాసన మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనుండగా.. వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి నారాయణ ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 9.20 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. అనంతరం బడ్జెట్ కు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. బడ్జెట్ ప్రవేశపెట్టడం పూర్తయిన తరువాత అసెంబ్లీ వాయిదా పడనుంది. అనంతరం స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరగనుంది. 22వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.

Share