Current Date: 30 Jun, 2026

తుని పాప జాహ్నవి జాడ దొరకలేదు.

వెతుకులాట కొనసాగుతుంది.
కాకినాడ ఎస్పీ బిందు మాధవ్.
తుని  పాప రెండు ఏళ్ళ చిన్నారి జాహ్నవి కోసం వెతుకులాట కొనసాగుతుందని కాకినాడ ఎస్పి జి బిందు మాధవ్ తెలిపారు. బుధవారం ఉదయం ఎస్పీ కార్యాలయంలో ఒక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా తుని పాప జాడ పై ప్రశ్నించిన అనంతరం ఆయన మాట్లాడుతూ తుని పరిసర ప్రాంతాలే కాకుండా ఇతర ప్రాంతాలకు వెతికే పనిని విస్తరించినట్లు ఆయన తెలిపారు. అయితే ఇప్పటివరకు ఏ విధమైన సమాచారం దొరకలేదని అన్నారు. అలాగని పాప కోసం వెతుకులాట మానలేదని బృందాలు జిల్లాలోనే కాదు అనుమానం ఉన్న ఇతర జిల్లాలకు తమ బృందాలు వెళ్లాయని వివరిస్తూ, జిల్లా ప్రజలు పాప క్షేమంగా ఉండాలని కోరుకోవాలని సూచించారు.