వెంకటేష్-అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో గతేడాది సంక్రాంతికి వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి భారీ హిట్‌గా నిలిచింది. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌లో ఫ్యామిలీ ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకున్న పాత్ర 'బుల్లిరాజు'. ఈ సినిమాతో ఎక్కడా లేని క్రేజ్ సంపాదించుకున్న ఈ బుడ్డోడి అసలు పేరు రేవంత్ కాగా, ఈ మూవీ తర్వాత అతడి పేరు బుల్లిరాజుగా మారిపోయింది. ఆ క్రేజ్‌తోనే ఈ ఏడాది విడుదలైన మెగాస్టార్ సినిమా 'మనశంకర వరప్రసాద్' చిత్రంలోనూ బుల్లిరాజు మరోసారి అభిమానులను అలరించాడు. తాజాగా వెంకటేష్-అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రాబోతున్న కొత్త సినిమా షూటింగ్ కూడా అధికారికంగా ప్రారంభమైంది. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలవనున్న ఈ చిత్రంలోనూ బుల్లిరాజు ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. దీనితో దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వరుసగా ముచ్చటగా మూడోసారి ఈ చైల్డ్ ఆర్టిస్ట్ సందడి చేయనున్నాడనే వార్త నెట్టింట ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ బుడ్డోడి రెమ్యునరేషన్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన టాక్ వైరలవుతోంది. తాజా సమాచారం ప్రకారం మన బుల్లిరాజు ఒక్క రోజు షూటింగ్‌కు ఏకంగా లక్ష రూపాయల పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంలో కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు
కమెడియన్ బ్రహ్మానందం రోజుకి ఒక లక్ష రూపాయలు పారితోషికం తీసుకున్నారు. ఇప్పుడు బుల్లిరాజు కూడా అదే క్రేజ్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు.