Current Date: 28 Nov, 2024

బ్రిటన్‌ నుంచి భారత్‌ చేరుకున్న ఛత్రపతి ఆయుధం

వీర మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ యుద్ధ సమయాల్లో ఉపయోగిం చిన ప్రత్యేకమైన ఆయుధం వాఫ్‌ునఖ్‌. ఇది పులి పంజా ఆకారంలో ఉంటుంది. లోహంతో తయారైన వాఫ్‌ునఖ్‌ ను చేతికి ధరించి ఎదుటి వ్యక్తి శరీరాన్ని చీల్చివేయవచ్చు. 1659లో బీజాపూర్‌ సామ్రాజ్య సైన్యాధిపతి అఫ్జల్‌ ఖాన్‌ను చంపడానికి శివాజీ ఈ ఆయుధాన్ని  ఉపయోగించాడని చరిత్ర చెబుతోంది. కాలక్రమంలో ఈ చారిత్రక వస్తువు బ్రిటన్‌ కు చేరింది. లండన్‌ లోని ప్రఖ్యాత విక్టోరియా అండ్‌ ఆల్బర్ట్‌ మ్యూజియంలో దీన్ని ప్రదర్శనకు ఉంచారు.  అనేక ప్రయత్నాలు చేసిన మీదట  వందల ఏళ్ల తర్వాత ఈ ఆయుధం తిరిగి భారత్‌ చేరుకుంది. బుల్లెట్‌ ప్రూఫ్‌ కవర్‌ లో ఉంచి ఈ ఆయుధాన్ని భద్రంగా భారత్‌కు తీసుకువచ్చారు.

Share