బాలీవుడ్ నటులు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్ విడాకులు తీసుకోబోతున్నట్లు గత కొన్నిరోజులుగా వార్తలు వస్తున్నాయి. కానీ.. అమితాబ్ కుటుంబం అధికారికంగా ఈ విడాకుల వార్తలను ఖండించలేదు. తాజాగా ఆ విడాకులు వార్త నిజమే అనేలా అభిషేక్ సంకేతాలిచ్చాడు. 2007లో అభిషేక్, ఐశ్వర్య పెళ్లి చేసుకోగా.. వారికి 2011లో ఆరాధ్య పుట్టింది. అయితే గత కొంతకాలంగా అభిషేక్, ఐశ్వర్య మధ్య బంధం బలహీనడిపట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల అనంత్ అంబాని పెళ్లి వేడుకలకి కూడా ఐశ్వర్య తన కూతురు ఆరాధ్యతో కలిసి వచ్చింది. అభిషేక్ ఎక్కడా ఫ్రేమ్‌లో కనిపించలేదు. అలానే అమితాబ్ ఫ్యామిలీ ఆ వేడుకలో ఉన్నప్పుడు ఐశ్వర్య అక్కడ తారపడలేదు. విడాకులపై ఓ జర్నలిస్ట్ రాసిన కథనానికి ఇన్‌స్టాగ్రామ్‌లో అభిషేక్ బచ్చన్ లైక్ కొట్టాడు. ఆ లైక్‌ను జర్నలిస్టు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో అభిషేక్, ఐశ్వర్య మధ్య రిలేషన్ దెబ్బతినట్లు క్లారిటీ వచ్చేసింది.