తిరుమల లడ్డు విషయంలో ఆధారాలు లేకుండా పవిత్రతను దెబ్బతీసేలా మాట్లాడారంటూ పవన్ కల్యాణ్‌పై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో ఒక పిటిషన్ దాఖలు అయ్యింది. పవన్ కల్యాణ్ మాటలకు ఎలాంటి ఆధారాలు లేవని రామారావు అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ వేశారు.తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిసినట్టుగా, అవే లడ్లను అయోధ్యకు పంపినట్టుగా వ్యాఖ్యానించి పవన్ పవిత్రతను దెబ్బతీసే ప్రయత్నం చేశారని, ఆధారాలు లేకుండా అలా మాట్లాడిన ఆయనపై చర్యలను కోరుతూ ఈ పిటిషన్ దాఖలైంది. పవన్ కల్యాణ్ ఇది వరకూ మాట్లాడిన మాటలను సోషల్ మీడియా నుంచి తొలగించేలా, మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఆదేశించాలని పిటిషన్ లో కోరారు.ఈ నేపథ్యంలో కోర్టు పవన్ కల్యాణ్ కు నోటీసులు జారీ చేసింది. రాజకీయాల నుంచి కనీసం దేవుడైనా మినహాయించాలని అంటూ సుప్రీం కోర్టు ఈ వ్యవహారంలో చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
Share