Current Date: 28 Nov, 2024

దేశంలో మరోసారి నిఫా వైరస్ వ్యాధి సోకిన గంటల్లోనే మరణం

దేశంలో మరోసారి నిఫా వైరస్ కలకలం రేపుతోంది. 14 ఏళ్ల బాలుడికి వైరస్ సోకిన కేవలం కొన్ని గంటల్లోనే గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా భయాందోళనలు మొదలయ్యాయి. కేరళలో  మళప్పురం జిల్లాలో 14 ఏళ్ల బాలుడికి నిఫా వైరస్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. అయితే ఆ బాలుడి కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే మృతి చెందాడు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ బాలుడు మరణించినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్‌ ఈ రోజు తెలిపారు. పూణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ ఈ విషయాన్ని నిర్థారించింది.

Share