కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ సదస్సు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వివిధ పార్లమెంటరీ దేశాల ప్రతినిధులతో కలిసి జరుపుకోవడం ఎంతో గర్వంగా ఉందని ఏపీ బీజేపీ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఈ సదస్సులో అర్ధవంతమైన చర్చలు జరుగుతున్నాయన్నారు. 73, 74 వ రాజ్యాంగ సవరణలతో స్థానిక సంస్థల స్థాయిలో కూడా మహిళలకు నిర్ణయం తీసుకునే సామర్థ్యం వచ్చిందన్నారు. పార్లమెంటులో మహిళా సభ్యుల సంఖ్య కూడా పెరిగిందని అన్నారు. అయినప్పటికీ, మహిళలపై దాడులు పెరుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. లైంగిక దాడులు, మహిళా నాయకులను అపఖ్యాతిపాలు చేయడం, వారిపై అభ్యంతరకర పదజాలాన్ని ఉపయోగించడం, వారి వారి నియోజకవర్గాల్లో వారు చేస్తున్న మంచి పనులను గుర్తించకపోవడం మొదలైనవి కూడా హింస అనే చెప్పుకోవచ్చు అని అన్నారు. కాగా, 8వ తేదీ వరకూ సదస్సులో పాల్గొని, 11న ఆమె స్వదేశానికి తిరిగి రానున్నారు.
Share