Current Date: 02 Apr, 2025

ఆసీస్‌తో ఈరోజు సెమీస్‌లో భారత్ ఢీ.. గెలిస్తే ఫైనల్‌కి

పాకిస్తాన్ ఆతిథ్యమిస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ- 2025 ముగింపు దశకు చేరుకుంది. గ్రూప్ స్టేజ్‌లో మూడు మ్యాచ్‌లలో విజయం సాధించి.. పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌లో నిలిచిన భారత్ జట్టు సెమీఫైనల్స్‌లో అడుగుపెట్టింది. సెమీస్‌లో భాగంగా  టీమిండియా ఈరోజు ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ హిస్టరీలో టీమిండియా సెమీఫైనల్స్ ట్రాక్ రికార్డును పరిశీలిస్తే..  ఐదుసార్లు సెమీ ఫైనల్స్‌కు భారత్ చేరింది. ఐదు మ్యాచ్‌లకిగానూ.. నాలుగు మ్యాచ్‌ల్లో అలవోకగా గెలిచి ఫైనల్స్‌లో అడుగుపెట్టింది. అలానే రెండు సార్లు విజేతగా నిలిచి ట్రోఫీని ముద్దాడింది. 1998లో మినహా టీమిండియా ఇప్పటివరకు సెమీఫైనల్స్‌లో ఓడిపోయింది లేదు. ప్రతి ఛాంపియన్స్ ట్రోఫీలోనూ విజయఢంకా మోగించింది. అయితే.. ఆస్ట్రేలియాతో తొలిసారి ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్స్‌లో ఆడనుంది.

Share