Current Date: 02 Apr, 2025

నోరుజారిన రష్మిక మంధాన.. కన్నడిగులు ఫైర్

హీరోయిన్ రష్మిక మంధాన మరోసారి నోరుజారి విమర్శలపాలైంది. బెంగళూరులో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌కు హాజరు కావాలని రష్మికను అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం కోరగా.. హేళనగా సమాధానమిచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.హీరోయిన్ రష్మికకు బుద్ధి చెప్పాల్సిన టైమ్ వచ్చిందంటూ  కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి మీడియా సమావేశంలోనే హెచ్చరించడం దుమారం రేపింది. మొన్నటికిమొన్న బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ తాను హైదరాబాద్ నుంచి వచ్చానంటూ చెప్పుకుంది రష్మిక. దీనిపై శాండిల్‌వుడ్‌లో చాలా దుమారం రేగింది. లైఫ్ ఇచ్చిన కన్నడ చిత్రసీమను పట్టించుకోకుండా, టాలీవుడ్ నుంచి వచ్చానని అనడంపై రష్మికపై రీసెంట్ గా చాలా పెద్ద ట్రోలింగ్ నడిచింది. ఇప్పుడు దానికి మరింత ఆజ్యం పోసేలా ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా ఇండస్ట్రీ వాళ్లకు నట్టులు, బోల్టులు బిగించాల్సిన అవసరం ఉందని హెచ్చరించాడు.

Share