Current Date: 02 Apr, 2025

ప్రతిపక్ష హోదా‌పై అసెంబ్లీలో సీటుతో జగన్‌కు సంకేతం

మాజీ సీఎం వైయస్ జగన్‌ను అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ ర‌ఘురామ సీటు కేటాయించిన తీరు ఇప్పుడు రాష్ట్రంలో చ‌ర్చనీయాంశ‌మైంది. సీఎం చంద్ర‌బాబుకు ఒక‌టో నంబ‌ర్ సీటు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌ క‌ల్యాణ్‌కు 39వ నంబ‌ర్ సీటును రఘురామ కేటాయించారు. జగన్‌కు మాత్రం ప్ర‌తిప‌క్షానికి కేటాయించే ముందు వ‌రుస‌లో సీటు కేటాయించ‌డం గమనార్హం. ప్ర‌తిప‌క్ష హోదాను జ‌గ‌న్ డిమాండ్ చేస్తున్నారు. ప్ర‌తిప‌క్ష హోదా ఇచ్చే విష‌య‌మై ఇప్ప‌టికే స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడికి ఏపీ హైకోర్టు వివ‌ర‌ణ కోరుతూ నోటీసులు కూడా ఇచ్చింది. అయితే ఇంత వ‌ర‌కూ స్పీక‌ర్ ఎలాంటి స‌మాధానం ఇవ్వ‌లేదు. కానీ.. ప్ర‌తిప‌క్ష హోదాకు బ‌దులు, ఆ ప‌క్షానికి కేటాయించే ముందు వ‌రుస‌లో జ‌గ‌న్‌కు సీటు కేటాయించ‌డంతో.. ఆ దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే.. కుర్చీనే జ‌గ‌న్‌కు ప్ర‌తిప‌క్ష హోదాగా భావించాల్సి వుంటుంద‌ని కూటమి నేతలు చెప్తున్నారు.

Share