తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మార్చబోతున్నారా? తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్తగా నియామకమైన ఇంఛార్జ్ మీనాక్షీ నటరాజన్ వచ్చింది అదే పని మీదా..? అంటే అవుననే బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. మిషన్ ఛేంజ్ టాస్క్ మీదనే మీనాక్షి నటరాజన్ తెలంగాణకు ఏఐసీసీ ఇంఛార్జిగా వచ్చారంటూ కీలక కామెంట్ చేశారు. డిసెంబర్‌లోపే ముఖ్యమంత్రిని మార్చేందుకు మీనాక్షి రంగం సిద్ధం చేస్తున్నారని సంచలన ఆరోపణ చేశారు. ఇప్పటికే సీఎం కుర్చీ మీద భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కన్నేశారంటూ జోస్యం చెప్పారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. తెలంగాణలో రోజురోజుకు రాజకీయ పరిణామాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎప్పుడు ఏ నేత ఏ బాంబు పేలుస్తాడో.. మంటలు రేపే మాటలు ఏం మాట్లాడుతారో అర్థం కాని పరిస్థితి నెలకొంది.
Share