Current Date: 02 Apr, 2025

ప్రారంభమైన ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు...

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసనమండలి (ఎమ్మెల్సీ) ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమం ప్రారంభమైంది. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల ఉపాధ్యాయుల ఓట్లను సోమవారం ఉదయం 8 గంటల నుంచి కట్టుదిట్టమైన భద్రత నడుమ లెక్కిస్తున్నారు. ఈ మేరకు ఏయూ ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలోని ఈఈఈ బ్లాక్లో ఏర్పాట్లు పూర్తి చేయగా,  పోటీలో ఉన్న అభ్యర్థులు, వారి తరఫు ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లను మాత్రమే లెక్కింపు కేంద్రంలోనికి అనుమతించారు. ఈ సందర్భంగా  నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాక్చి , జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ పర్యవేక్షణలో కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించారు.

Share