Current Date: 02 Apr, 2025

కివీస్‌ను పడగొట్టి సెమీస్‌లోకి భారత్.. నెక్ట్స్ ఆసీస్ టార్గెట్

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా అదరగొట్టేస్తోంది. న్యూజిలాండ్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 44 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 రన్స్ చేసింది. అనంతరం న్యూజిలాండ్‌ను 45.3 ఓవర్లలో 205 రన్స్‌కి ఆలౌట్ చేసింది. 5 వికెట్లు తీసిన వరుణ్ చక్రవర్తి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు.భారత్ జట్టులో శ్రేయస్ అయ్యర్ (79), అక్షర్ పటేల్‌ (42), హార్దిక్ పాండ్యా (45 బంతుల్లో 45 రన్స్) చెప్పుకోదగ్గ స్కోరు చేయడంతో టీమిండియా 9 వికెట్లకి 249 పరుగులు చేసింది. అనంతరం 250 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ను గెలిపించేందుకు ఆ జట్టు మాజీ కెప్టెన కేన్ విలియమ్సన్ (81) గట్టిగా పోరాడాడు. దుబాయ్ పిచ్‌పై ఇదేమీ పెద్ద లక్ష్యం కాదు. కానీ.. భారత స్పిన్నర్ల దెబ్బకు మిగిలిన బ్యాటర్లు తేలిపోయారు. మరీ ముఖ్యంగా వరుణ్ చక్రవర్తిని ఎదుర్కొనేందుకు ఆ జట్టు బ్యాటర్లు ఆపసోపాలు పడ్డారు. 

Share