మోడీ అంటే మన ప్రధాని నరేంద్ర మోడీనే. ఆయనను హెచ్చరిస్తూ.. ఓ ప్రముఖ హోటల్ తాజాగా లేఖ రాసింది. ''మోడీ సర్ .. బిల్లు కట్టండి లేక పోతే చర్యలు తప్పవు'' అని హెచ్చరిం చడం గమనార్హం. దీంతో కీలక ఎన్నికల సమయంలో కేంద్ర ప్రభుత్వంతోపాటు.. ప్రధాని మోడీ, బీజేపీ లు కూడా ఇరుకున పడ్డాయి. దీనిపై ఏం చేయాలని స్థానిక బీజేపీ నాయకత్వం కూడా చర్చిస్తోంది. ఏం జరిగింది? సాధారణంగా ప్రధాని మోడీ వంటివారు.. ఇతర రాష్ట్రాల్లో పర్యటనలకు వెళ్లినప్పుడు.. ప్రఖ్యాత హోటళ్ల లో బస చేస్తారు. అయితే.. ఆయా పర్యటనలకు సంబంధించిన బిల్లులను లెక్క చూసి ప్రధాని కార్యాల యం చెల్లిస్తుంది. కొంత ఆలస్యమేఅయినా.. వాటిని ఇచ్చేస్తుంది. అయితే.. కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రధాని చేసే పర్యటనలు రాజకీయం కిందకు వస్తాయి. దీంతో ఇలాంటి బిల్లులు ఎవరు చెల్లించాలనే మీమాంస వస్తుంది. ఇప్పుడు ఇలాంటి చిక్కే వచ్చిపడింది. గత ఏడాది మేలో కర్ణాటక ఎన్నికలు జరిగాయి. ఇక్కడ అప్పట్లో బీజేపీ సర్కారే ఉంది. దీంతో దీనిని మరో సారి నిలబెట్టుకునేందుకు బీజేపీ బాగానే ప్రయత్నించింది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ మూడు రోజుల పాటు రాష్ట్రంలోనే ఉండి ప్రచారం చేశారు. ఈ క్రమంలో మైసూరులోని ఓ ప్యాలెస్(హోటల్)లో ప్రధాని బస చేశారు. మూడు రోజులు ఆయన ఉన్నందుకు.. ఆయన సిబ్బందికి. ఇతర అధికారులకు కలిపి మొత్తం రూ.84 లక్షల బిల్లయింది. అయితే.. దీనిని ఇప్పటి వరకు అంటే.. ఎన్నికలు ముగిసి ఏడాది వరకు కూడా చెల్లించలేదు. దీనిపై అనేక సందర్భాల్లో ప్యాలెస్ సిబ్బంది అటు కేంద్ర ప్రభుత్వాన్ని.. ఇటు బీజేపీ ని కూడా నిలదీశారు. అయితే.. ప్రధాని పర్యటన కాబట్టి.. మోడీ కార్యాలయం చెల్లిస్తుందని.. బీజేపీ చెప్పుకొచ్చింది. కానీ, మోడీ కార్యాలయం మాత్రం.. ఇదిరాజకీయ పర్యటన కాబట్టి.. తమకు సంబంధం లేదని తెలిపింది. మొత్తంగా రూ.84 లక్షల బిల్లు పెండింగులోనే ఉంది. ఇప్పుడు తాజాగా ఈ ప్యాలెస్ యాజమాన్యం.. ఇస్తారా? న్యాయపరమైన చర్యలు తీసుకోమంటారా? అంటూ.. ప్రధానికి లేఖ రాయడం సంచలనంగా మారింది. దీనిపై ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి.