ఢిల్లీ సీఎం పదవికి అరవింద్ కేజీవాల్ రాజీనామా చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కలిసి రాజీనామా లేఖను అందించారు. ఆప్ నూతన శాసన సభాపక్షనేతగా ఆతిశీని ఎంపిక చేసినట్లు ఎల్టీకి తెలిపారు. మరో వారం రోజుల్లో ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా ఆతిశీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.