Current Date: 26 Nov, 2024

విశాఖ కేజీహెచ్ లో మిరాకిల్

విశాఖపట్నానికి చెందిన ఓ గర్భిణీ పురుటీ నొప్పులతో శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో కేజీహెచ్ ప్రసూతి విభాగంలో చేరారు. వైద్యులు సీజేరియన్ చేసి ప్రసవం చేశారు. మగ బిడ్డ జన్మించినప్పటికి బరువు తక్కువగా ఉండడంతో డాక్టర్లు అత్యవసర వైద్య సవాలు అందించారు. ఎనిమిది గంటల పాటు శ్రమించారు. శనివారం తెల్లవారుజాము 4 గంటల సమయంలో శిశువుకు ఊపిరి ఆడలేదు. వైద్యులు పరిశీలించి ప్రాణాలు పోయిందని చెప్పడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అయ్యారు. శిశువు మృతి చెందినట్టు ఆసుపత్రి రికార్డ్స్ లో సిబ్బంది ఎంట్రీ చేశారు. ఆస్పత్రి సిబ్బంది శిశువుని తండ్రికి అప్పగించారు. శిశువుని ఇంటికి తరలించేందుకు తండ్రి అంబులెన్స్ లోకి లెక్కిస్తున్నడు. సరిగ్గా అదే సమయంలో శిశువులో కదలికలు కుటుంబ సభ్యులు గుర్తించారు. వైద్యులకు సమాచారం అందించగా.. వెంటనే వారు స్పందించి పిడియాట్రిక్ విభాగంలో ఎన్ఐసీయుకు తరలించి చికిత్స అందించారు. శిశువు ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. చనిపోయాడని భావించిన శిశువు భతికే ఉండటంతో ఆ తండ్రి ఆనందంతో కంటతడి పెట్టుకున్నాడు.

Share