Current Date: 25 Nov, 2024

ఏపీలో నూతన ఎయిర్ పోర్టుల నిర్మాణానికి ప్రతిపాదనలు

ఏపీలో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం కొత్త ఎయిర్ పోర్టుల నిర్మాణంపై దృష్టి సారించింది. రాష్ట్రంలో ఆరు చోట్ల కొత్త ఎయిర్ పోర్టుల నిర్మాణానికి ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఆ మేరకు నిధులు కూడా కేటాయించింది. ఫీజిబిలిటీ అధ్యయనం కోసం ప్రభుత్వం రూ.1.92 కోట్లు విడుదల చేసింది.  కుప్పం, పలాస, నాగార్జునసాగర్ సమీపంలో, ఒంగోలు, తాడేపల్లిగూడెం, తుని-అన్నవరం ప్రాంతాల్లో ఎయిర్ పోర్టులు నిర్మించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. నిధులు కేటాయించిన నేపథ్యంలో, సాధ్యమైనంత త్వరగా ఫీజిబిలిటీ అధ్యయనం పూర్తిచేయాలని ఏపీ ఎయిర్ పోర్టు డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎండీని ఆదేశించింది.

Share