స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎమ్మెల్సీగా ఉన్న రఘురాజుపై మండలి చైర్మన్ మోషన్ రాజు వేసిన అనర్హత వేటును హైకోర్టును రద్దు చేసింది. తనపై వేసిన అనర్హతను కొట్టివేయాలంటూ ఇందుకూరి రఘురాజు గతంలోనే హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై బుధవారం తుదివిచారణ జరిగింది. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం మండలి ఛైర్మన్ తీసుకున్న నిర్ణయం చెల్లదంటూ నేడు తీర్పుఇచ్చింది. దీంతో ఆయన 2027 నవంబర్ 31 వరకు ఎమ్మెల్సీగా కొనసాగనున్నారు. ఇది ఇలా ఉంటే అనర్హత వేటును పరిగణనలోకి తీసుకున్న ఎన్నికల సంఘం ఇప్పటికే ఈ స్థానం ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల చేసింది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభ కానున్నతరుణంలో హైకోర్టు తీర్పురావడంతో ఉప ఎన్నిక ప్రక్రియ నిలిచిపోయింది.