Current Date: 07 Oct, 2024

అల్లర్లతో బంగ్లాదేశ్‌లో కర్ఫ్యూ

ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల విధానాన్ని సంస్కరించి  ప్రతిభకు పట్టం కట్టాలని డిమాండు చేస్తూ బంగ్లాదేశ్‌లోని విశ్వవిద్యాలయాల్లో గత కొన్ని రోజులుగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఇవి కాస్తా హింసాత్మకంగా మారి ఇప్పటివరకు 105 మంది మృతిచెందినట్లు స్థానిక మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి భారతీయులు   స్వదేశానికి తిరిగొస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 450 మంది భారత పౌరులు సరిహద్దు దాటి మేఘాలయ చేరుకున్నట్లు అధికారులు శనివారం వెల్లడిరచారు. 8 వేల మంది విద్యార్థులతో సహా 15వేల మంది భారతీయులు బంగ్లాదేశ్‌లో ఉన్నారని, వారంతా క్షేమమని భారత విదేశాంగ శాఖ వెల్లడిరచింది.   ఆందోళనకారులు, పోలీసులకు మధ్య జరుగుతున్న ఘర్షణల్లో ఇప్పటివరకు కనీసం 105 మంది మృతిచెందినట్లు పలు మీడియా కథనాలు వెల్లడిరచాయి. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో శుక్రవారం అర్ధరాత్రి నుంచి దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించారు.

Share