Current Date: 03 Oct, 2024

తెలుగు బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లిన కంటెస్టెంట్స్ వీళ్లే ఒక్కరే ఫేమస్!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గ్రాండ్‌గా ఆదివారం రాత్రి లాంచ్ అయింది. కలర్ ఫుల్ హౌస్‌తో కొత్త కొత్త కాన్సెప్ట్‌లతో సీజన్ 8 ప్రారంభమైంది. మొత్తం 14 మంది కంటెస్టెంట్లు తొలిరోజు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇందులో సినిమా నటులతో పాటు సీరియల్‌ నటులు ఎక్కువ మంది ఉన్నారు. అలానే యూట్యూబర్, సోషల్ మీడియాలో ఫేమస్ అయిన వ్యక్తులకీ చోటు లభించింది.బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్ 8 కంటెస్టెంట్స్ వీళ్లేయష్మీ గౌడ (సీరియల్ నటి), నిఖిల్ మిల్క్ల (సీరియల్ నటుడు), అభయ్ నవీన్ (నటుడు, యూట్యూబర్), ప్రేరణ కంభం (సీరియల్ నటి), ఆదిత్య ఓం (నటుడు), సోనియా ఆకుల (నటి),బెజవాడ బేబక్క (యూట్యూబర్, సోషల్ మీడియా ఫేమ్),  శేఖర్ బాషా (ఆర్జే), కిర్రాక్ సీత (యూట్యూబర్), నాగ మణికంఠ (యూట్యూబర్, సోషల్ మీడియా ఫేమ్), అఫ్రిదీ (యూట్యూబర్), విష్ణు ప్రియ (యాంకర్), నైనిక (ఢీ డ్యాన్సర్), పృథ్వీరాజ్ (నాగ పంచమి సీరియల్) ఉన్నారు.  కానీ ఈ జాబితాలో యాంకర్ విష్ణు ప్రియ తప్ప అందరికీ తెలిసిన కంటెస్టెంట్ ఎవరూ లేరు. ఈ సీజన్‌లో గ్లామర్, ఎంటర్టైన్మెంట్ ఇచ్చేది ఒక్క విష్ణు ప్రియ మాత్రమే అని అప్పుడే నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

Share