Current Date: 03 Oct, 2024

బాలయ్యతో కలిసి ఫ్యాక్షన్ సినిమా చేయాలి కోరిక బయటపెట్టిన చిరంజీవి

రాయలసీమ ఫ్యాక్షన్ సినిమాలకి నందమూరి బాలకృష్ణ బ్రాండ్ అంబాసిడర్.. అలాంటి బాలయ్యతో కలిసి ఒక ఫ్యాక్షన్ సినిమా చేయాలని ఉందని మెగాస్టార్ చిరంజీవి తన మనసులో మాటని బయటపెట్టారు. నటుడిగా బాలయ్య యాభై ఏళ్లు పూర్తి చేసుకోవడంతో స్వర్ణోత్సవాలను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ ‘‘నేను నటించిన ఇంద్ర సినిమా చేయడానికి ఆదర్శం సమర సింహా రెడ్డి. బాలయ్యతో కలిసి ఒక ఫాక్షన్ సినిమా చేయాలని కోరికగా ఉంది. ఫ్యాన్స్ సాధారణంగా గొడవలు పడుతుంటారు. కానీ హీరోల మధ్య ఎంత మంచి బంధం ఉంటుందో తెలియడం కోసం కొన్ని వేడుకలు చేసుకునేవాళ్లం. 50 సంవత్సరాల ఈ ప్రయాణంలో ఇంకా హీరోగా నటించే ఘనత బాలయ్యకే సొంతం. ఆ భగవంతుడు బాలయ్యకు ఇదే ఎనర్జీ ఇస్తూ 100 ఏళ్లు బావుండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నా’’ అని చిరంజీవి చెప్పుకొచ్చారు. ఇంద్ర, సమర సింహారెడ్డి  సీక్వెల్‌ ఒకే సినిమాగా వస్తే ఇద్దరం చేస్తామని.. దర్శకులు ఆ దిశగా ఆలోచించాలని  ఆ వేదికపై నుంచే చిరంజీవి సూచించారు.

Share