భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాతో పెళ్లి రూమర్స్‌పై టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ ఎట్టకేలకి స్పందించాడు. పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌తో సానియా మీర్జా ఇటీవల విడాకులు తీసుకోగా మహ్మద్ షమీ కూడా తన భార్య హసీన్ జహాన్‌తో విభేదాల కారణంగా విడిపోయాడు. దాంతో ఈ ఇద్దరూ వివాహం చేసుకోబోతున్నట్లు గత కొన్ని రోజులు నుంచి సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. షమీ, సానియా వివాహంపై ఇప్పటికే సానియా మీర్జా తండ్రి స్పందించి ఆ రూమర్స్‌ని కొట్టిపడేశారు. చాలా రోజుల తర్వాత ఎట్టకేలకి షమీ కూడా స్పందించారు. ‘సోషల్ మీడియాలో బాధ్యతగా వ్యవహరించాలి. ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం మంచిది కాదు.నాపై వచ్చిన రూమర్స్,వివాహంపై వచ్చిన మీమ్స్‌ను నేను కూడా చూశా. ఫోన్ తెరిస్తే అవే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ ఒకరి జీవితానికి సంబంధించిన విషయాలపై మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఆలోచించి స్పందించాలి’ అని షమీ చెప్పుకొచ్చాడు. పెళ్లి రూమర్‌పై మీరేమంటారు అని ప్రశ్నించగా ‘మీకు ధైర్యముంటే సోషల్ మీడియాలో వెరిఫైడ్ అకౌంట్ నుంచి ఈ రూమర్‌పై నన్ను అడగండి అప్పుడు సమాధానం చెప్తాను’ అని షమీ ఘాటుగా రియాక్ట్ అయ్యాడు.