సీఎం చంద్రబాబు ఈనెల 11 న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనులను పరిశీలించనున్నారు. ఈ నేపధ్యంలో ఎయిర్ పోర్ట్ ప్రాంతంలో ఈ రోజు విజయనగరం కలెక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పర్యటించి ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. తొలిసారిగా ముఖ్యమంత్రి జిల్లాలో పర్యటిస్తున్న నేపధ్యంలో ఏర్పాట్లు పక్కాగా ఉండాలని, ఎక్కడా ఎటువంటి పొరపాట్లు జరగడానికి వీల్లేదని ఆధికారులను కలెక్టర్ ఆదేశించారు.