హైదరాబాద్‌లో ఓ వ్యక్తి తన కుమారుడిని కరిచిందనే ఆగ్రహంతో కుక్కను చంపేశాడు. దాన్ని కర్రలతో చితకబాది బిల్డింగ్ రెండో అంతస్తు నుంచి కిందకు విసిరాడు. దీంతో కుక్క యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయగా కుక్కను చంపిన వ్యక్తిని అరెస్టు చేశారు. గోషామహల్ షాయినాయత్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జుమ్మేరాత్బజార్లోని దేవీనగర్‌లో మల్లమ్మ అనే మహిళ ఇంట్లో కుక్కను పెంచుకుంటోంది. అదే ఇంట్లో కింది అంతస్తులో సత్యనారాయణ అనే వ్యక్తి కుటంబంతో సహా ఉంటున్నాడు. దీపావళి సందర్భంగా సత్యనారాయణ కుమారులు టపాసులు కాలుస్తూ కుక్కపై విసిరారు. కోపంతో కుక్క సత్యనాయారణ కుమారుడిని కరిచింది. ఆగ్రహం వ్యక్తం చేసిన సత్యనారాయణ ఇనుపరాడ్‌తో కుక్కను చితకబాదాడు. అనంతరం రెండో అంతస్తు పై నుంచి కిందకు కుక్కను విసిరిపారేశాడు. దాంతో కుక్క స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయింది. కుక్క యజమానురాలు మల్లమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రంగంలోకి దిగిన పోలీసులు కుక్కను పోస్టుమార్టం నిమిత్తం పంపించారు.
Share