Current Date: 28 Nov, 2024

మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్ అరెస్ట్

మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్ బుధవారం అరెస్టయ్యారు. రౌస్ అవెన్యూ కోర్టు అనుమతితో సీబీఐ ఆయనను అదుపులోకి తీసుకుంది. న్యాయమూర్తి అమితాబ్ రావత్ ఆదేశాలు జారీచేసిన వెంటనే సీబీఐ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీ కోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టులో సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను కేజ్రీవాల్ ఉపసంహరించుకున్నారు. మనీలాండరింగ్ కేసులో ఊరటినిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్‌కు బెయిలు మంజూరు చేయగా, హైకోర్టు నిలుపుదల చేసింది. దీంతో హైకోర్టు తీర్పును కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఇప్పుడా పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు.

Share