ఐపీఎల్ 2024లో ముంబయి మళ్లీ తడబడింది. వాంఖడే వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆదివారం రాత్రి జరిగిన 20 పరుగుల తేడాతో చేజేతులా ఓడిపోయింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన చెన్నై 206 పరుగులు చేయగా.. ఛేదనలో ముంబయి 186 పరుగులకే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ సెంచరీ బాదినా.. ముంబయిని గెలిపించలేకపోయాడు.
ముంబయి ఓటమితో హార్దిక్ పాండ్యాపై మళ్లీ ట్రోలింగ్ మొదలైంది. ఈ సీజన్‌లో తొలి మూడు మ్యాచుల్లో ఓడినప్పుడు ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత రెండు మ్యాచుల్లో గెలవడంతో అవి కాస్త తగ్గాయి. ఇక అంతా సెట్ అయింది అనుకుంటున్న సమయంలో.. చెన్నైతో ఓటమి ద్వారా ప్రేక్షకులు పాండ్యాను మళ్లీ ట్రోల్స్ చేయడం ప్రారంభించారు. రోహిత్ శర్మ సెంచరీ చేయడం కూడా హార్దిక్‌ని మరింత ఇరుకున పడేసింది.
మ్యాచ్‌లో లాస్ట్ ఓవర్ వేసిన హార్దిక్ పాండ్యా.. ధోనీ దెబ్బకి వరుసగా 6,6,6 సమర్పించుకుని మొత్తం 20 పరుగులు ఇచ్చేశాడు. చివరికి మ్యాచ్‌లో చెన్నై గెలిచింది కూడా ఆ 20 పరుగుల తేడాతోనే కావడం విశేషం. దాంతో హార్దిక్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించాలని అభిమానులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు