కర్ణాటకలో రసవత్తర పోరు కొనసాగనుంది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో జేడీఎస్ అధినేత దేవెగౌడ పెట్టని కోటగా హసన్ నియోజకవర్గం నిలుస్తోంది. ఇక్కడ నుంచి దేవెగౌడ ఎక్కువసార్లు విజయం సాధించి సమీప ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించారు. దీంతో ఈ సారి కూడా ఇక్కడ పోటీలో రెండు రాజకీయ కుటుంబాలు పోటీ పడుతున్నాయి. ఇందులో ఎవరు విజయం సాధిస్తారో చూడాల్సిందే. హసన్ నియోజకవర్గంలో మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు 33 ఏళ్ల ప్రజ్వల్ రేవణ్ణ కనుసన్నల్లోనే ఉంటుంది. తాజా ఎన్నికలో బీజేపీ, జేడీఎస్ కూటమి అభ్యర్థిగా మరోసారి పోటీలో ఉన్నారు. ప్రజ్వల్ ప్రత్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి శ్రేయస్ ఎం పటేల్ రంగంలో నిలిచారు. ఇతడు మాజీ మంత్రి, దివంగత నేత పుట్ట స్వామి గౌడ మనవడు. ఇద్దరు మనవళ్లు ఇక్కడ నుంచిబరిలో నిలవడం విశేషం. ఇక్కడ నుంచి ఎక్కువసార్లు గెలిచింది దేవెగౌడ వారసులే. 1985లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హొళెనరసిపుర స్థానం నుంచి అప్పటి జనతా పార్టీ అభ్యర్థిగా దేవెగౌడ పోటీ చేశారు. ఆయనపై పుట్టస్వామి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1989లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన దేవెగౌడ ఓటమి చెందారు. 1989 లోక్ సభ ఎన్నికల్లో హసన్ నుంచి పోటీ చేసిన దేవెగౌడపై విజయం సాధించారు. హసన్ నియోజకవర్గంలో ఆధిపత్యం దేవెగౌడ కుటుంబానిదే. పుట్టస్వామి కుటుంబంపై వీరిదే పైేయి. 1984, 2004 ఎన్నికల్లో పుట్టస్వామి హొళెనరసిపుర శాసనసభనుంచి పోటీ చేసి దేవెగౌడ పెద్ద కుమారుడు రేవణ్ణ చేతిలో ఓడిపోయారు. 2008,2013 ఎన్నికల్లో పుట్టస్వామి కోడలు అనుపమ పోటీలో ఉన్నా ఓటమి తప్పలేదు. పుట్టస్వామి మనవడు శ్రేయస్ పటేల్ సైతం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దేవెగౌడ తన మనవడి కోసం సీటును త్యాగం చేశారు. మనవడు ప్రజ్వల్ 1.41 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. జేడీఎస్ తరఫున గెలిచిన ఏకైక ఎంపీ ఆయనే