మండు వేసవిలో కాస్త ఉపశమనం. గతంలో మరెప్పుడూ లేని విధంగా మే మొదటి వారంలోనే వర్షం పడడంతో జనం సేద తీరారు. విశాఖ పరిసర ప్రాంతాల్లో మంగళవారం ఉదయం సుమారు 2గంటల పాటు వివిధ చోట్ల చిరుజల్లులతో మొదలై వాన కురవడంతో ప్రజలు ఉప్పొంగిపోయారు. వడగాల్పులు, వేసవి ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరైన జనానికి వాతావరణ శాఖ చల్లని కబురే చెప్పింది. తూర్పు విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు, తెలంగాణా, రాయలసీమ, దక్షిణ అంతర్గత కర్నాటక మీదుగా సముద్ర మట్టానికి 0.9కి.మీ ఎత్తులో ద్రోణి విస్తరించడం వల్లే ఈ వాన ప్రభావం అని వాతావరణ శాఖ చెబుతోంది. దీని కారణంగా మరో మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.