Current Date: 07 Oct, 2024

బంగాళాఖాతంలో వాయుగుండం ఏపీకి వర్ష సూచన

వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాలకు చేరువలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇది రేపు  ఉదయం వాయవ్య దిశగా పయనం ప్రారంభిస్తుందని, ఒడిశాలోని పూరీ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. ఈ వాయుగుండం ప్రభావంతో ఏపీలో రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, నంద్యాల, విజయనగరం, ప్రకాశం, ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీఎస్డీఎంఏ వివరించింది.

Share