Current Date: 07 Oct, 2024

ఈరోజు భారత్, పాక్ మధ్య మ్యాచ్.. రికార్డులివే!

ఈరోజు భారత్, పాకిస్థాన్ జట్లు తలపడబోతున్నాయి. మహిళల ఆసియా కప్ - 2024 టీ20 టోర్నమెంట్‌‌లో భాగంగా ఈరోజు రాత్రి 7 గంటలకి భారత్, పాకిస్థాన్ ఉమెన్స్ జట్లు ఢీకొనబోతున్నాయి. చివరిగా ఈ ఏడాది జూన్ నెలలో ఇరుజట్లు టీ20 ప్రపంచకప్ లో తలపడ్డాయి. మహిళల ఆసియా కప్-2024కు శ్రీలంక ఆతిథ్యం ఇస్తోంది. ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. ప్రతి టీం తమ గ్రూప్ లో మిగిలిన టీమ్స్ తో ఒక్కో మ్యాచ్ ఆడతాయి. గ్రూప్ దశలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్ కు అర్హత సాధిస్తాయి. టోర్నీలో తొలి మ్యాచ్ నేపాల్, యూఏఈ మహిళా జట్ల మధ్య మధ్యాహ్నం 2గంటలకు జరుగుతుంది. రెండో మ్యాచ్ లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత్ జట్టు ఆసియాకప్ లో ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన అదిరే ఫామ్ లో ఉండటం టీమిండియాకు కలిసొచ్చే అంశం. పాకిస్థాన్ పై భారత్ జట్టుకు మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య 14 మ్యాచ్ లు జరిగాయి. అందులో భారత్ జట్టు 11 గెలిచింది.

Share