Current Date: 27 Nov, 2024

మెడికవర్ ఆసుపత్రిలో తప్పిన ప్రమాదం

నగరంలోని వెంకోజీ పాలెం ప్రాంతంలో గల మెడికవర్ ఆసుపత్రిలో ఘోరప్రమాదం తప్పింది. సోమవారం రాత్రి 11:30 గంటలకు సమయం లో ఆసుపత్రి సెల్లార్లో ఉన్న బ్యాటరీల వద్ద అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో ఆందోళనకు గురైన రోగులు వారి బంధువులు పరుగులు తీశారు. భారీగా పొగ వ్యాపించడంతో రోగులు ఇబ్బందులు పడ్డారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సకాలంలో ఆస్పత్రి కి చేరుకోని మంటలను ఆర్పివేయడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

Share