ఆదివారం రాత్రి 43 ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. 64.5 మి. మీ ల నుంచి 115.5మిమీ ల వర్ష పాతం నమోదయిందిఅత్యధికంగా అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 125.7మిమీలు,నంద్యాల జిల్లా పాణ్యంలో 113.2మిమీ లు,ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో 106.2మిమీ వర్షపాతం నమోదయింది.205 ప్రాంతాల్లో కురిసిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసాయి. ఈ ప్రాంతాల్లో 15.6 నుంచి 64.4మిమీల వర్ష పాతం నమోదయింది.సోమవారం రాష్ట్రంలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ తెలిపింది.లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల సంస్థ ఎండీరోణంకి కూర్మనాథ్ సూచించారు.