Current Date: 29 Sep, 2024

మేఘాద్రి గెడ్డ రిజర్వాయర్ ను సందర్శించిన విశాఖ జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్, ఎమ్మెల్యే గణబాబు

విశాఖ నగరం లోని గోపాల పట్నంలో కొండ చరియాలు విరిగిపడటంతో నివాస గృహాలు ప్రమాదపు అంచున వున్నాయి. దీనిపై గోపాలపట్నంలో ఈరోజు విరిగి పడిన కొండ చరియలను, మేఘాద్రి గడ్డ రిజర్వాయర్ ను ..విశాఖ పచ్చిమ ఎమ్మె ల్యే గణబాబు తో కలిసి జిల్లా కలెక్టర్ ఎం ఎన్ హరేంధిర ప్రసాద్ పరిశీలించారు. విశా ఖ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు మేఘాద్రి గెడ్డ రిజర్వాయర్ కు భారీగా వరద నీరు వచ్చి చేరింది. రిజర్వాయర్ గరిష్ట పరిమితి 60 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 57.4 అడుగులకు చేరుకుంది. క్యాచ్మెంట్ ఏరియాలో వర్షం ప్రభావం లేనం దున ప్రస్తుతానికి గేట్లు ఎత్తే పరిస్థితి లేదని కలెక్టర్ అన్నారు. గేట్లు ఎత్తే పరిస్థితి వస్తే నాలుగు గేట్లు ఎత్తుతామని, ఇప్పటికే రెవెన్యూ, జివిఎంసి అధికారులు పల్లపు ప్రాం త ప్రజలని అప్రమత్తం చేశారని కలెక్టర్ తెలిపారు .

Share