కాకినాడ జిల్లా తుని నుండి అనకాపల్లి జిల్లా నర్సీపట్నం వెళ్లే రహదారి రాకపోకల ను తాత్కాలికంగా నిలిపివేసిన ట్లు నాతవరం ఎస్సై రామారావు తెలిపారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నాతవరం మండలం గన్నవరం మెట్ట వద్ద వెర్రి గెడ్డ పొంగి రోడ్డుపై నుండి వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో ముందు జాగ్రత్త చర్య గా నర్సీపట్నం నుంచి తుని వైపు వెళ్లే రాకపోకలను పూర్తిగా నిలిపివేశామన్నా రు. నర్సీపట్నం నుంచి తుని వెళ్లే ప్రయాణికులు, వాహనదారులు..నర్సీపట్నం నుండి మాకవరపాలెం మీదుగా వెళ్లాలని సూచించారు. అలాగే తుని నుంచి వచ్చే వాహనాలకు కోటనందూరు వరకు మాత్రమే అనుమతి ఇచ్చామన్నారు. లోతట్టు ప్రాంతాల్లో వున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై రామారావు సూచించారు.
Share