Current Date: 28 Nov, 2024

భారత న్యాయ సంహిత చట్టాన్ని రద్దు చేయాలి

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భారత న్యాయ సంహిత చట్టాన్ని రద్దు చేయాలని  సిఐటియూ జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ డిమాండ్ చేశారు. విశాఖ ఆటో రీక్ష  కార్మిక సంఘం నేతృత్వంలో భారత న్యాయ సంహిత చట్టాన్ని రద్దు చెయ్యాలని డిమండ్ చెస్తూ  జీవీఎంసీ గాంది విగ్రహం వద్ద  నిరసన కార్యక్రమం నిర్వహించారు.  అనంతరం ఊరేగింపుగా వెళ్లి  జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం భారతీయ న్యాయ సంహిత 2023 పేరు మీద డిసెంబర్ 21న పార్లమెంటులో బిల్లుని ఆమోదించిందని, దానికి రాష్ట్రపతి డిసెంబర్ 25న ఆమోద ముద్ర వేశారని తెలిపారు. ఆ చట్టంలోని సెక్షన్ 106 (1) (2) ప్రకారం యాక్సిడెంట్ కేసులలో డ్రైవర్లకి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష, 10 లక్షల వరకు జరిమానా విదించడం అన్నది అత్యంత ప్రమాదకరమని దీనిని తమ సంఘం ఖండిస్తుందన్నారు.  డ్రైవర్ల మీద పడుతున్న ఒత్తిడి, అసంతృప్తి ఆందోళనలకు  కారణాలు పరిశీలించకుండా ప్రమాదాల నివారించడానికి అవసరమైన చర్యలు చేపట్టకుండా డ్రైవర్లది పూర్తి బాధ్యత చేయడం సరి కాదని అభిప్రాయపడ్డారు.

Share