Current Date: 28 Nov, 2024

పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన అంతర్జాతీయ నిపుణులు

ఆంధ్రప్రదేశ్‌ జీవనాడి పోలవరం ప్రాజెక్టును అంతర్జాతీయ జలవనరుల నిపుణులు పరిశీలించారు. అమెరికా, కెనడా నుంచి వచ్చిన నలుగురు నిపుణుల బృందం   పోలవరం ప్రాజెక్టుకు ఆదివారం ఉదయం సుమారు 10 గంటలకు చేరుకుంది.   ప్రాజెక్టు పరిసరాలను పరిశీలించి అధికారులతో మాట్లాడారు. అమెరికా నుంచి డేవిడ్‌ పి.పాల్‌, గెయిన్‌ ఫ్రాంకో డి సిక్కో, కెనడా నుంచి రిచర్డ్‌ డానెల్లీ, సీన్‌ హించ్‌ బెర్గర్‌ ఈ బృందంలో ఉన్నారు. డయాఫ్రం వాల్‌, రెండు కాఫర్‌ డ్యాంలు, గైడ్‌ బండ్‌లను నిపుణులు పరిశీలించారు. ప్రాజెక్టు డిజైన్ల నుంచి ప్రస్తుత పరిస్థితి వరకు సమగ్ర అధ్యయనం చేయనున్నారు.   జులై 3 వరకు ప్రాజెక్టు సైట్‌లో పనులను నిపుణులు పరిశీలిస్తారు.

Share