స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాకినాడలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “ఏపీకి చెందిన ఎర్ర చందనం దొంగలను కర్నాటకలో పట్టుకుంటే వారికి రూ.140 కోట్లు వచ్చాయి. అవి మనకే ఉంటే ఎంత మంది విద్యార్థులను చదివించవచ్చో ఆలోచించండి”అని అన్నారు. సామజిక పింఛన్ల మొత్తాన్ని పెంచాం. ఉచితంగా ఇసుక అందిస్తున్నాం. డొక్కా సీతమ్మ పేరిట స్కూళ్లలో మధ్యాహ్న భోజనం, ఎన్టీఆర్ స్పూర్తితో పెద్దలకు రూ. 5కే భోజనం కార్యక్రమాలు అమలు చేస్తున్నాం అని తెలిపారు.